Emani Varninthunu - Jonah Samuel | Telugu Lyrics
Song | Emani Varninthunu |
Album | Single |
Lyrics | inspirMe |
Music | Bro Jonah Samuel |
Sung by | Dr. Manasa |
- Telugu Lyrics
- English Lyrics
ఏమని వర్ణింతును యేసయ్య నీదు మేలులు
ఏమని వివరింతును యేసయ్య నీ కార్యములు
కష్టాలలో కన్నీటిలో నాకు ఓదార్పుగా నిలిచావు
ఆకలి లో ఆవేదనలో నేనున్నానని మాటిచ్చావు - ఏమని వర్ణింతును
1.అలలై ఎగసిన సమయములో అమరము పై నీవు ఉన్నావు
గుండె చెదరిన వేళలో ఓదార్చి ధైర్యం పరిచావు
నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా ఆశ్రయమైన దీపం వెలిగించినావయ్యా . (2) - ఏమని
2.కృంగిన సమయములో నీ ప్రేమతో పలకరించావు
ఆపద కలిగిన వేళలో బలపరచి పోషించావు
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసావు
ప్రకారముగా నన్ను నిలువబెట్టావు. (2) - ఏమని
3.పడిన సమయములో నీ దయతో నిలువ బెట్టావు
కలత చెందిన వేళలో వాక్యము తో తృప్తిపరిచావు .
నా జీవితం ఇలా దీవెనగా మార్చావు
చితికిన బ్రతుకును చిగురింప చేసావు. (2) - ఏమని
English
Emani Varninthunu - Jonah Samuel | Telugu Lyrics
Reviewed by Christking
on
March 24, 2021
Rating:
No comments: