Naa Koraku Baliyaina - నా కొరకు బలియైన ప్రేమ - Christking - Lyrics

Naa Koraku Baliyaina - నా కొరకు బలియైన ప్రేమ

నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ (2)
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)
క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు||

నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)
నా మంచి యేసయ్యా (2) ||నా కొరకు||

నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2)
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా (2) ||నా కొరకు||

=======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

Naa Koraku Baliyaina Prema
Bahu Shramalu Bhariyinche Prema (2)
Kadu Ghora Katina Shiksha Sahiyinche Prema (2)
Thudhi Shwaasanaina Naakai Arpinche Prema (2)
Kreesthesu Prema ||Naa Koraku||

Naa Hrudaya Yochane Jariginche Paapamu
Naa Kriyala Dhoshame Nadipinche Pathanamukai (2)
Ae Manchi Yundhani Preminchinaavayyaa
Naa Ghora Paapamukai Maraninchinaavayyaa
Unnatha Prema Choopi Rakshinchinaavayyaa (2)
Naa Manchi Yesayyaa (2) ||Naa Koraku||

Nee Siluva Thyaagamu Naa Rakshanaadhaaram
Nee Raktha Prokshanaye Naa Nithya Aishwaryam (2)
Arhathe Leni Naakai Maraninchinaavayyaa
Nee Marana Thyaagame Brathikinche Yesayyaa
Aemichchi Nee Runam Ne Theerchagalanayyaa
Praanaathma Dehamutho Sthuthiyinthu Yesayyaa
Ghanaparathu Yesayyaa (2) ||Naa Koraku||

Naa Koraku Baliyaina - నా కొరకు బలియైన ప్రేమ Naa Koraku Baliyaina - నా కొరకు బలియైన ప్రేమ Reviewed by Christking on July 25, 2018 Rating: 5
Powered by Blogger.