Nee Swaramu - నీ స్వరము వినిపించు : Telugu Lyrics
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో – నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము||
భయ భీతులలో – తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను – (2) ||నీ స్వరము||
నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో – సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా – (2) ||నీ స్వరము||
నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు – (2) ||నీ స్వరము||
నా హృదయములోని – చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు – మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా – (2) ||నీ స్వరము||
English Lyrics
Nee Swaramu Vinipinchu Prabhuvaa
Nee Dhaasudaalakinchun (2)
Nee Vaakyamunu Nerpinchu
Daaniyandu Naduchunatlu Neetho ||Nee Swaramu||
Udayamune Lechi – Nee Swaramu Vinuta
Naaku Entho Madhuramu
Dinamanthati Koraku – Nanu Siddhaparachu
Rakshinchu Aapadalanundi – (2) ||Nee Swaramu||
Nee Vaakyamu Chadivi – Nee Swaramu Vinuchu
Nenu Sari Chesikondu
Nee Maargamulo – Naduchunatlugaa
Nerpinchumu Ellappudu – (2) ||Nee Swaramu||
Bhaya Bheethulalo – Thuphaanulalo
Nee Swaramu Vinipinchumu
Abhayamu Nimmu – O Goppa Devaa
Dhairya Parachumu Nannu – (2) ||Nee Swaramu||
Naatho Maatlaadu – Spashtamugaa Prabhuvaa
Nee Swaramu Naa Korake
Neetho Manushyulatho – Sarichesikondu
Nee Divya Vaakyamu Dvaaraa – (2) ||Nee Swaramu||
Nerchukunnaanu – Naa Shramala Dvaaraa
Nee Vaakyamunu Entho
Nannunchumu Prabhuvaa – Nee Vishwaasyathalo
Nee Yandu Nilachunatlu – (2) ||Nee Swaramu||
Naa Hrudayamuloni – Chedu Thalampulanu
Chedhinchu Nee Vaakyamu
Nee Roopamunaku – Maarchumu Nannu
Needu Mahima Korakegaa – (2) ||Nee Swaramu||
Nee Swaramu - నీ స్వరము వినిపించు : Telugu Lyrics
Reviewed by Christking
on
October 02, 2017
Rating: