Tharaalu Maarinaa - తరాలు మారినా : Lyrics 1252 - Christking - Lyrics

Tharaalu Maarinaa - తరాలు మారినా : Lyrics 1252


తరాలు మారినా మారనే మారదు
ఎన్ని యుగాలైనా విడువదు ఎడబాయదు (2)

ఏ ఫలమును ఆశించని ప్రేమ – ఏ బలమును కోరని ప్రేమ
ఏ భేదము చూపని ప్రేమ – అది వర్ణనకందని ప్రేమ
తనపై నను మోసే ప్రేమ – అనుదినము కాచే ప్రేమ
నను మోక్షం చేర్చే ప్రేమ – ఆ యేసుని కల్వరి ప్రేమ ||తరాలు||

దుష్టులతో సాంగత్యం – చెడు సావాసముతో తిరుగుచుండగా
పిలిచావయ్యా నీ ప్రేమగల పిలుపుతో
ఈర్ష్యాసూయలతో – కోపద్వేషాలతో నలిగియుండగా
మలిచావయ్యా నీ దయగల హస్తముతో (2)
ఘోరపాపినైన నన్ను – చేర్చుకున్న ప్రేమ
వేషధారినైన నన్ను – మార్చుకున్న ప్రేమ
ఆ కలువరిసిలువలో నాకై – శ్రమలనోర్చుకున్న ప్రేమ
ఏ క్రమమూ లేని నన్న-మర్చుకున్న ప్రేమ

నను ఎన్నడూ విడనాడని
ఎడబాయని శాశ్వతమైన ప్రేమ ||తరాలు||

నీ ప్రేమను రుచి చూచి – నీ సన్నిధినే విడచి
ఇహలోకపు ఆశలతో నే కుక్కవలె తిరిగాను
నీ వాక్యపు వెలుగును ఎంచి – నీ మార్గాన్నే మరచి
ఈ పాపపు పంకములో నే పందివలె పొర్లాను (2)
నిను విడచీ నే మరచిననూ – నను వెదకిన ప్రేమ
నా కన్నా నన్ను ప్రేమించే – నీ కృపగల ప్రేమ
నా పాప శాప జీవితం – నాకు చూపిన ప్రేమ
అది తెలసి తిరిగిరాగా – మళ్లీ చేర్చుకున్న ప్రేమ ||నను ఎన్నడూ||

Tharaalu Maarinaa Maarane Maaradhu
Enni Yugaalainaa Viduvadhu Edabaayadhu (2)
Ae Phalamunu Aashinchani Prema – Ae Balamunu Korani Prema
Ae Bedhamu Choopani Prema – Adi Varnanakandani Prema
Thanapai Nanu Mose Prema – Anudinamu Kaache Prema
Nanu Moksham Cherche Prema – Aa Yesuni Kalvari Prema ||Tharaalu||

Dushtulatho Saangathyam – Chedu Saawaasamutho Thiruguchundagaa
Pilichaavayyaa Nee Premagala Piluputho
Eershyaasooyalatho – Kopa Dveshaalatho Naligiyundagaa
Malichaavayyaa Nee Dayagala Hasthamutho (2)
Ghorapaapinaina Nannu Cherchukunna Prema
Veshadhaarinaina Nannu Maarchukunna Prema
Aa Kaluvari Siluvalo Naakai Shramalanorchukunna Prema
Ae Kramamuu Leni Nannamarchukunna Prema
Nanu Ennaduu Vidanaadani
Edabaayani Shaashwathamaina Prema ||Tharaalu||

Nee Premanu Ruchi Choochi – Nee Sannidhine Vidachi
Iha Lokapu Aashalatho Ne Kukkavale Thirigaanu
Nee Vaakyapu Velugunu Yenchi – Nee Maargaanne Marachi
Ee Paapapu Pankamulo Ne Pandivale Porlaanu (2)
Ninu Vidachii Ne Marachinanoo – Nanu Vedakina Prema
Naa Kanna Nannu Preminche – Nee Krupagala Prema
Naa Paapa Shaapa Jeevitham – Naaku Choopina Prema
Adi Thelasi Thirigi Raagaa – Malli Cherchukunna Prema ||Nanu Ennaduu||

Tharaalu Maarinaa - తరాలు మారినా : Lyrics 1252 Tharaalu Maarinaa - తరాలు మారినా : Lyrics 1252 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

No comments:

Powered by Blogger.