Idigo Deva Naa Jeevitham - ఇదిగో దేవా నా జీవితం : Lyrics 1072
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4) ||ఇదిగో||
పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో||
నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
Idigo Deva Naa Jeevitham
Aapaadamasthakam Neekankitham (2)
Sharanam Nee Charanam (4) ||Idigo||
Palumaarlu Vaidolaginaanu
Paraloka Darshanamunundi
Viluvaina Nee Divya Pilupuku
Ne Thaginatlu Jeevinchanaithi (2)
Ainaa Nee Prematho
Nannu Dari Cherchinaavu
Anduke Gaikonumu Devaa
Ee Naa Shesha Jeevitham ||Idigo||
Nee Paadamula Chentha Cheri
Nee Chiththambu Neneruga Nerpu
Nee Hrudaya Bhaarambu Nosagi
Praarthinchi Panicheyanimmu (2)
Aagipoka Saagipovu
Priyasuthuniga Panicheyanimmu
Prathi Chotha Nee Saakshigaa
Prabhuvaa Nannundanimmu ||Idigo||
Idigo Deva Naa Jeevitham - ఇదిగో దేవా నా జీవితం : Lyrics 1072
Reviewed by Christking
on
June 21, 2017
Rating:
ఇదిగో దేవా నా జీవితం is written some 25 years back by Y.Babji when he was a student in Agricultural University. He is associated with UESI. I was one among the students learnt this song when Babji taught us by singing. He composed the lyrics and tune too. The song was published in Vidyarthi Geethavali of UESI. Hence I request you to acknowledge him wherever you find the song. Further, it is not ప్రియ సుతునిగా...it is ప్రేషితుని గా....నశించు ఆత్మలన్ దగ్గర నశియించు విద్యార్థులన్.
ReplyDelete